నాగ్‌ 'నమో వేంకటేశాయ' టైటిల్‌ రగడ !

Posted on January 12, 2017

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అద్భుత సృష్టి 'అన్నమయ్య'. ఆ సినిమాలో భక్తుడు అన్నమయ్య చరిత్రని తెరకెక్కించారు కాబట్టి సినిమాకి టైటిల్‌ 'అన్నమయ్య' అని పెట్టారు. అలాగే రామదాసు చరిత్రగా తెరకెక్కిన సినిమాకి కూడా 'శ్రీరామదాసు' అనే టైటిల్‌ పెట్టడం జరిగింది. కానీ నాగార్జున తాజా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' సినిమాకి మాత్రం టైటిల్‌ ఎందుకు వేరుగా పెట్టారు అంటూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా శ్రీవారి భక్తుడు హథీరామ్‌ బాబా. ఈయన చరిత్రే 'ఓం నమో వేంకటేశాయ' సినిమా. అయితే ఈ చిత్రానికి ఎందుకు 'హథీరామ్‌ బాబా' అని టైటిల్‌ పెట్టలేదు. 'ఓం నమో వేంకటేశాయ' అని పెట్టారు అంటూ గిరిజన సంఘాలు ఆందోళన బాట పట్టాయి. హథీరామ్‌ బాబ గిరిజన భక్తుడు కాబట్టి ఈ సినిమాకు ఆ పేరు పెట్టలేదు. కాబట్టి టైటిల్‌ విషయంలో పునరాలోచన చెయ్యాలి అంటూ అభ్యంతరాలొస్తున్నాయి. కానీ ఓ సినిమా విషయంలో పలానా టైటిల్‌ పెట్టాలి అనేది దర్శక, నిర్మాతల ఆలోచనపై బేస్‌ అయ్యి ఉంటుంది. ఇలాంటి సినిమాలు వెండితెర అద్భుతాలు. అలాంటిది వీటి విషయంలో వివాదాలు తలెత్తడం అనేది ఆశ్చర్యకరం. ఇదివరకట్లో సినిమా అనుకోగానే పలు వివాదాలు కూడా వెంటాడేవి. ఈ మధ్య తగ్గాయి. మళ్లీ ఈ సినిమాకి మొదలయ్యాయి. చిరంజీవి సినిమా 'ఖైదీ' విషయంలో కూడా కథ నాదే అంటూ పలు వివాదాలొచ్చాయి. కానీ ఈ అనవరసర వివాదాల వల్ల సాధించేదేమీ ఉండదు. ఎలా తలెత్తుతాయో అలాగే సమసిపోతాయి. సినిమాని సినిమాగా చూసి ఎంజాయ్‌ చేస్తే వినోదంగా ఉంటుంది. ఆ వినోదాన్ని వివాదం చేస్తే వచ్చే లాభం ఏముంటుంది చెప్పండి.

Loading...