కుటుంబం, తెలుగు సినీ కుటుంబం !

Posted on January 11, 2017

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ వార్‌ మొదలయ్యింది. ఇందుకు కారణం రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్‌ కావడమే. చాలా కాలంగా ఇలాంటి గట్టి పోటీ లేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో ఇలాంటి పోటీ నెలకొంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వస్తోన్న 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి పోటీగా బాలయ్య వందో చిత్రం 'గౌతమీ పుద్ర శాతకర్ణి' కూడా రావడమే. అయితే ఈ హీరోలు మాత్రం ఈ పోటీని మనసారా స్వాగతిస్తుంటే, ఇరు వర్గాల అభిమానులు మాత్రం వివాదాస్పదం చేస్తున్నాయి. మరో పక్క స్టార్‌ హీరోలు ఈ హీరోలిద్దరకీ తమ విషెస్‌ని అందిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు బాగా ఆడాలని ఆకాంక్షిస్తున్నాయి. చిరంజీవి సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా బాగా ఆడాలని ఆయనకు విషెస్‌ అందించారు. అలాగే ఆయన చిన్న సినిమాలైన 'శతమానం భవతి', హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య' సినిమాలకు కూడా తన విషెస్‌ని అందించారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అన్నయ్య చిరంజీవి చాలా కాలం తర్వాత హీరోగా చేస్తున్న సినిమా ఘన విజయం సాధించాలని కోరుతూ తన విషెస్‌ని అందించారు. తాజాగా విక్టరీ వెంకటేష్‌ కూడా ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఈ సంక్రాంతి అసలు సిసలైన పండగ. ఎందుకంటే మాంచి కిక్కెక్కించే ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. సో ఫ్యాన్స్‌కి పండగే పండగ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇలా ఈ ఇద్దరు హీరోల సినిమాలకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ విషెస్‌ అందుతున్నాయి. కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయిపోయింది. మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

Loading...