లక్కున్నోడికి అదిరిపోయే రెస్పాన్స్‌ !

Posted on January 11, 2017

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'లక్కున్నోడు'. ఈ సినిమాలో విష్ణు మస్కెట్‌ హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. గతేడాది 'ఆడో రకం ఈడో రకం' సినిమాతో మంచు విష్ణు విజయం అందుకున్నాడు. ఈ ఏడాది 'లక్కున్నోడు' సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది. సోషల్‌ మీడియాలో ఈ ట్రైలర్‌కి రెస్పాన్స్‌ అదరిపోతోంది. హన్సిక చాలా క్యూట్‌గా అందంగా కనిపిస్తోంది ఈ సినిమాలో. హన్సికతో మంచు విష్ణు ఆల్రెడీ రెండు సినిమాలు చేశాడు. 'దూసుకెళ్తా', 'పాండవులు పాండవులు తుమ్మెద'. ఈ రెండు సినిమాలు మంచి విజయాలుగా నిలిచాయి విష్ణు కెరీర్‌లో. ఇప్పుడు 'లక్కున్నోడు' సినిమాకి హన్సిక లక్‌ ఇంకోసారి కలిసొచ్చేలా ఉంది. విష్ణు ఎప్పటిలాగే యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేస్తున్నాడు. ఎంటర్‌టైనింగ్‌ క్యారెక్టర్‌లో ఆకట్టుకుంటున్నాడని ట్రైలర్‌ చూసినవాళ్ళంతా చెబుతుండడం సినిమాకి ప్రీ రిలీజ్‌ హైప్‌ పెరగడానికి కారహనవుతోంది. మంచు విష్ణుకి 'ఢీ' సినిమా మంచి విజయాన్ని అందించింది. ఆ స్థాయి విజయాన్ని మళ్లీ ఈ సినిమాతో దక్కించుకోనున్నాడని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ తరహాలోనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని మలచారు. 'గీతాంజలి' సినిమాతో హిట్‌ కొట్టిన రాజ్‌ కిరణ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా సినిమాకీ లుక్‌ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే విష్ణు, ఈ సినిమా కోసం కూడా మరో న్యూ లుక్‌ ట్రై చేశాడు.

Loading...