పెన్ను పట్టింది బాలయ్యని దృష్టిలోనే పెట్టుకుని !

Posted on January 11, 2017

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా అనుకోగానే ముందుగా నా మదిలో మెదిలిన రూపం బాలకృష్ణ. బాలకృష్ణలాంటి స్టార్‌ హీరో సినిమా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నానంతే. ఈ మాటలు అన్నది మరోవరో కాదు, 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా డైరెక్టర్‌ క్రిష్‌. నిజానికి బాలయ్యకి ఇది వందో చిత్రం. సో చాలా జాగ్రత్తగా ఈ సినిమాని తెరకెక్కించాలి. అలా అని ఈ సినిమా విషయంలో నేనేమీ ప్రెషర్‌ ఫీల్‌ కాలేదు. బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నానని ఎంతో గర్వంగా ఫీలయ్యాను అంతే అని క్రిష్‌ తెలిపారు. తెలుగు వారి చరిత్రని చాటి చెప్పే స్టోరీని అత్యద్భుతంగా తెరకెక్కించాలి. ప్రజలకు అత్యంత సులువుగా అర్ధం కావాలి. తద్వారా ఈ సినిమా ప్రేక్షకులకి చేరువ కావాలి. ఇవే నా లక్ష్యాలు. దాన్ని ఫాలో చేసుకుంటూ ప్యాషన్‌తో ఈ సినిమాను టేకప్‌ చేశాను అని క్రిష్‌ తెలిపారు. అనుకున్నట్లుగానే ఈ సినిమాకి బాలయ్య సపోర్ట్‌ లభించింది. అలాగే టీమ్‌ సపోర్ట్‌తో నేనేమనుకున్నానో అలాగే, అంతే గొప్పగా ఈ చరిత్రని తెరపై ఆవిష్కరించగలిగాను అంటున్నాడు క్రిష్‌. అనుకున్న టైంకి, అనుకున్న బడ్జెట్‌లో ఈ సినిమాని పూర్తి చేయగలగడానికి చిత్ర యూనిట్‌ అంతా చాలా కష్టపడింది. అందుకు టీమ్‌ మొత్తానికి క్రిష్‌ థన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ సినిమాని సక్సెస్‌ చేయాల్సిన బాధ్యత ప్రేక్షకులదే అని ఆయన అన్నారు. జనవరి 12న 100 ధియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

Loading...