శాతకర్ణి డబుల్‌ బొనాంజా !

Posted on January 11, 2017

బాలకృష్ణని బాక్సాఫీస్‌ బొనాంజా అని పిలుస్తారు. అంతేకాదు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకి పన్ను మినహాయింపు లభించింది. ఇది చాలా సంతోషించాల్సి విషయం. ఎందుకంటే చరిత్రని చాటి చెప్పే స్టోరీ ఇది. అందుకే ఇలాంటి సినిమాలకి వినోదపు పన్ను మినహాయింపు అనేది అవసరం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు కమర్షియల్‌ ఆలోచనలతో రూపొందవు. అందుకే ఇలాంటి సినిమాలని ప్రోత్సహిస్తే మరిన్ని ఈ తరహా మూవీస్‌ తెరకెక్కే అవకాశాలుంటాయి. అలాంటి శుభ పరిణామానికి 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా నాంది పలికిందనే చెప్పాలి. క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ ఈ సినిమాని చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. బాలయ్య వందో చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుకే ఈ సినిమా పట్ల చాలా ప్యాషన్‌తో ఉన్నారు బాలయ్య. అలాగే సినిమా సక్సెస్‌పై కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. కమర్షియల్‌ హంగులున్నాయా లేదా అనేది పక్కన పెడితే తెలుగు చరిత్రని చాటి చెప్పే సినిమా ఇది. అందుకే ప్రతీ తెలుగు వాడు ఈ సినిమాని చూసి తరించాలి. భారతదేశాన్ని ఏక ఛత్రాదిపత్యంతో పాలించిన శాతవాహన రాజు శాతకర్ణి. ఈ పాత్రలో బాలయ్య చక్కగా ఒదిగిపోయారు. ఆయనికి జోడీగా ముద్దుగుమ్మ శ్రియ కూడా చాలా బాగుంది. అలాగే చాలా కాలం తర్వాత బాలీవుడ్‌ సీనియర్‌ నటి హేమామాలిని ఈ సినిమాలో నటించారు. అందుకే ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. ఈ అంచనాలన్నీ నిజం చేయడానికి ఈ సినిమా జనవరి 12న భారీగా తెలుగు రాష్ట్రాల్లోని వంద ధియేటర్లలో విడుదల కానుంది.

Loading...