యూపీ కప్పులో తుపాను చల్లారిందా?

Posted on January 11, 2017

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఈ మధ్యకాలంలో యూపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుండగా, ఈ రోజు మలుపు అత్యంత కీలకమైనది. సమాజ్‌వాదీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ పేరుని ఖరారు చేసింది. పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ములాయం తనయుడే అఖిలేష్‌ యాదవ్‌. అయితే కొన్ని కారణాలతో పార్టీ రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. ఓ వర్గానికి అఖిలేష్‌ నేతృత్వం వహిస్తుండగా, ఇంకో వర్గానికి ములాయం నేతృత్వం వహిస్తున్నారు. దాంతో సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కూడా అయోమయంలో పడింది. ఇప్పటికిప్పుడు గుర్తుపై సస్పెన్స్‌ వీడదని తెలుసుకున్న తండ్రీ కొడుకుల మధ్య రాజీ ఎలా కుదిరిందోగానీ ఇద్దరూ ఒక్క మాటపైకి వచ్చేలా ఉన్నారు. ముఖ్యమంత్రిగా అఖిలేష్‌ పేరునే ములాయం ప్రతిపాదించడంతో వివాదం సద్దుమణిగినట్లే. అయితే వీరిద్దరి నడుమ చిచ్చు పెట్టిన శివపాల్‌ యాదవ్‌ మాత్రం వివాదాన్ని ఇంకా తెగేదాకా లాగాలనుకుంటున్నారని సమాచారమ్‌. తండ్రి కొడుకులు కలిసిపోయాక వివాదానికి ఆస్కారం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైపోయింది. దాంతో వివాదాన్ని లాగడం ద్వారా వచ్చే లాభం కన్నా నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఉత్తరప్రదేశ్‌ అనే టీ కప్పులో చీలిక అనే తుపాను చల్లారినట్లు భావించాలి.

Loading...