ఖైదీనే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే !

Posted on January 11, 2017

మెగాస్టార్‌ చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా మరో మూడు రోజుల్లో విడుదలకి సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా చిరంజీవి మీడియా ముందుకు వచ్చారు. 'ఖైదీ సినిమా ముచ్చట్లు మీడియాతో పంచుకున్నారు. మెగాస్టార్‌ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్త బయటికి వచ్చినప్పట్నుంచీ మొదలుకొని చిరంజీవి చాలా కథల్ని విన్నారట. అయితే ఏ కథని ఎంచుకోవాలి అనే దాని మీద గట్టి కసరత్తులే చేశారట. ఇంత గ్యాప్‌ తర్వాత వస్తున్న మెగాస్టార్‌ మూవీ అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకుంటారు కాబట్టి, వాళ్లని ఫస్ట్‌ సేటిస్‌ఫై చెయ్యాలి అనే ఉద్దేశ్యంతోనే ఈ కథని ఎంచుకోవడం జరిగింది అని చిరంజీవి తెలిపారు. చాలా కథలు విన్నారు. అందులో కొన్ని కథలు నచ్చాయి కూడా. కానీ 'కత్తి' సినిమాలో ఫ్యాన్స్‌కి నచ్చే ఎలిమెంట్స్‌ అన్నీ బాగున్నాయని ఈ కథని సెలెక్ట్‌ చేసుకున్నాను అంటూ అసలు చిరంజీవి ఈ సినిమానే ఎందుకు చేయాల్సి వచ్చిందనే రీజన్‌ని తెలిపారు. అలాగే తన నెక్ట్స్‌ మూవీ విశేషాలు కూడా చిరంజీవి చెప్పారు. తన నెక్స్ట్‌ మూవీ దాదాపుగా సురేందర్‌ రెడ్డితోనే అని కూడా ఆయన చెప్పకనే చెప్పారు. సురేందర్‌ రెడ్డి 'ధృవ' సినిమాతో చరణ్‌కి సూపర్‌ హిట్‌ ఇచ్చాడు. చిరంజీవి కోసం కూడా ఓ మంచి కథని సిద్ధం చేశారట. తొందర్లోనే అది ఫైనల్‌ కానుందట. అంతేకాదు ఈ కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్స్‌లోనే తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారమ్‌.

Loading...