పవన్‌కి మాత్రమే ఆ సత్తా ఉంది !

Posted on January 10, 2017

రాజకీయాల్లో ప్రస్తుతం పవన్‌ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క ప్రజా సమస్యలను ప్రభుత్వం దృస్టికి తీసుకురావడంలాంటి ఏక్టివిటీస్‌ చేస్తూ ప్రజలకి చాలా దగ్గరవుతున్నారు పవన్‌. పవన్‌ రాజకీయాల ఎంట్రీ గురించి చిరంజీవిని అడగ్గా, ప్రస్తుత రాజకీయాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ రాజకీయ ధోరణిని మార్చే సత్తా ఖచ్చితంగా పవన్‌కి ఉంది అని చిరు తెలిపారు. పవన్‌లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో రాణించగలరా? అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకి పవన్‌ నిజాయితీ పరుడు. స్ట్రెయిట్‌ ఫార్‌వర్డ్‌ పర్సనాలిటీ. సో ఈ రకమైన స్వభావంతో ఇప్పుడు రాజకీయ పరిస్థితులను మార్చగలడనే నమ్మకం నాకుంది. ఇలాంటి వ్యక్తులను రాజకీయాల్లోకి ఆహ్వానించడం అనేది చాలా శుభ పరిణామం. త్వరలోనే రాజకీయాల్లో కొత్త ఒరవడి నెలకొనే అవకాశాలుంటాయి పవన్‌ లాంటి వ్యక్తుల ఎంట్రీ వల్ల అని చిరంజీవి అన్నారు. అయితే భవిష్యత్తులో అన్నదమ్ములిద్దరూ కలిసి పని చేసే అవకాశాలున్నాయా అంటే ప్రస్తుతం నేను చెప్పలేను కానీ, పూర్తిగా లేవని కూడా చెప్పలేను అని చిరు అన్నారు. మా ఇద్దరి దారులు పూర్తిగా భిన్నం. కానీ చివరికి చేరే గమ్యం ఒక్కటే. ఆ రకంగా మేము ఎప్పటికైనా కలిసి పని చేసే అవకాశాలైతే ఉన్నాయేమో కానీ ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితి మాత్రం నాకు కనబడడం లేదు అని చిరు తెలిపారు. అలాగే పవన్‌ ఎంచుకున్న దారికి పెద్దన్నయ్యగా నేనెప్పుడూ అడ్డు తగలను అని కూడా మెగాస్టార్‌ చెప్పారు.

Loading...