చరణ్‌ని తెగ పొగిడేస్తోన్న యంగ్‌ హీరో !

Posted on January 10, 2017

నవదీప్‌ 'జై' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా పెద్దగా సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌ లేకపోయినా నటుడిగా మంచి పేరే సంపాదించుకున్నాడు. అయితే చాలా కాలంగా నవదీప్‌కి హీరోగా ఆఫర్స్‌ లేవు. గతంలో 'ఆర్య' సినిమాలో అల్లు అర్జున్‌కి ఫ్రెండ్‌గా కొంచెం నెగిటివ్‌ షేడ్‌ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ 'బాద్‌షా' సినిమాలో కన్నింగ్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించాడు. ఇక ఈ యంగ్‌ హీరో ఇలా నెగిటివ్‌ పాత్రలకే ఫిక్స్‌ అయిపోయాడు కాబోలు అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత నవదీప్‌ పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ బుల్లితెరపై ఓ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఈ మధ్య ప్రేక్షకులకి దగ్గరగానే ఉన్నాడు. అయితే తాజాగా 'ధృవ' సినిమాతో నవదీప్‌కి వెండితెరపై మళ్లీ మంచి బ్రేక్‌ వచ్చిందనే చెప్పాలి. 'ధృవ' సినిమాలో రాంచరణ్‌కి ఫ్రెండ్‌గా చాలా సపోర్టింగ్‌ రోల్‌లో నటించాడు. ఈ సినిమా సక్సెస్‌ అయినందుకు చాలా చాలా హ్యాపీ ఫీలవుతున్నాడు. చరణ్‌పై సినిమాలో చూపించిన అభిమానం నటన కాదు. అచ్చంగా నిజమే అంటున్నాడు. అందుకే ఆ పాత్ర అంత బాగా పండించగలిగాను అంటున్నాడు ఈ యంగ్‌ హీరో. 'ధృవ' సక్సెస్‌తో తనకి మళ్లీ మంచి క్యారెక్టర్స్‌ వస్తున్నాయట. 'ధృవ' ఇచ్చిన సక్సెస్‌తో సినిమాల్లో మళ్లీ బిజీ అవ్వాలని అనుకుంటున్నాడట. అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయంటున్నాడు. గతేడాది ఎండింగ్‌ ఇచ్చిన ఉత్సాహంతో ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి సినిమాలు చేస్తానంటున్నాడు నవదీప్‌.

Loading...