పూర్ణ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసేస్తోంది !

Posted on January 10, 2017

గతేడాది 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ముద్దుగుమ్మ పూర్ణ. ఆ సినిమా పూర్ణలో కొత్త ఉత్సాహం నింపింది. హర్రర్‌ మూవీస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయిన పూర్ణకి ఈ సినిమా ఓ రిఫ్రెష్‌నిచ్చిందట. కెరీర్‌లో మంచి సినిమాగా ఈ సినిమా పూర్ణకి ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీ అంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో హర్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీలో నటిస్తోందట. ఆ సినిమా పేరు 'రాక్షసి'. అయితే ఈ సినిమాలో పూర్ణ ఏమీ రాక్షసిలా కనబడదట కానీ తన క్యారెక్టర్‌ మాత్రం కొత్తగా ఉండబోతోందంటోంది. పన్నా రాయల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోందట. ఇంతవరకూ చాలా సినిమాల్లో తాను దయ్యంగా భయపెట్టాను. కానీ ఈ సినిమాలో అలా కాదు. తెరపై తనను చూసి చాలా కొత్త అనుభూతిని పొందుతారంటోంది పూర్ణ. అసలు ఈ సినిమాలో పూర్ణ క్యారెక్టర్‌ ఏంటనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాయి పూర్ణ మాటలు. అందం, అభినయం ఆమె ఆస్తులు. తొలి సినిమా 'సీమ టపాకాయ్‌'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. డాన్సుల్లో సూపర్‌ అన్పించుకుంది. చిన్నప్పట్నుంచీ తనకు డాన్స్‌ అంటే ప్రాణమంటోంది పూర్ణ. అందుకే డాన్స్‌ కథాంశంగా ఓ సినిమాలో నటించాలనుంది అని తన మనసులోని మాట తెలిపింది. అందుక తగ్గ అవకాశం కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తానంటోంది. అంతవరకూ ఏ అవకాశాన్ని వదలకుండా నా వంతు వినోదాన్ని ప్రేక్షకులకి అందిస్తానని క్యూట్‌ క్యూట్‌గా చెప్పేస్తోంది ముద్దుగుమ్మ పూర్ణ.

Loading...