అల్లరోడికి అచ్చొచ్చిన దయ్యం !

Posted on January 10, 2017

చాన్నాళ్లుగా సరైన హిట్‌ లేక సతమతమవుతోన్న అల్లరి నరేష్‌కి కొంత ఊరట లభించింది. తాజా చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా చెప్పుకోదగ్గ విజయాన్నివకపోయినా, గత చిత్రాలతో పోల్చితే ఫర్వాలేదనిపించింది. అలా పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పిన నరేష్‌ కొత్త సంవత్సరంలో కొంచెం కొత్తగా ఆలోచించి మళ్లీ ఇదివరకటిలాగే ప్రేక్షకుల్ని మెప్పిస్తానంటున్నాడు. అయితే కామెతో కాదట. ప్రస్తుతం కామెడీ హీరోలు చాలా మంది వచ్చేశారు. సో తన కామెడీకి ఇదివరకటి వేల్యూ లేదు. స్పూప్‌లు చేసినా, నా మార్కు కామెడీ చేసినా ఇంతవరకూ ప్రేక్షకులు ఆదరించారు. కానీ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే తన ట్రాక్‌ ఛేంజ్‌ చేసుకుంటున్నానంటున్నాడు. కామెడీతో పాటు కొత్త కథలకి వెల్‌ కమ్‌ చెబుతానంటున్నాడు. కామెడీ కన్నా కాన్సెప్ట్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తానంటున్నాడు. తొలిసారిగా 'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' సినిమాతో హారర్‌ని టచ్‌ చేసిన అల్లరి నరేష్‌ కొంత సక్సెస్‌ అయినట్లే కనిపించినా, కానీ అది తనకు చాలదంటున్నాడు. అంతకుమించి ఇంకేదో ఉందట. అది త్వరలోనే చూపిస్తానంటున్నాడు. నరేష్‌ కేవలం కామెడీ హీరోనే కాదు. నరేష్‌లోన ఇంకా చాలా యాంగిల్స్‌ ఉన్నాయి. నెగిటివ్‌ షేడ్స్‌ని పండించే సత్తా కూడా ఉంది నరేష్‌లో. సో నరేష్‌ ఒకవేళ హీరోగానే కాకుండా విలన్‌గా కూడా నటించే అవకాశాలున్నాయని తాజా సమాచారమ్‌.

Loading...