ఆ సినిమాల్లో నటించాలంటున్న శృతి !

Posted on January 10, 2017

శృతి హాసన్‌ మల్టీ టాలెంట్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా అని ఆ సినిమాలు అంటే అదేదో అడల్ట్‌ మూవీస్‌ అనుకునేరు. కాదండీ బాబూ. ఇప్పటికే శృతిహాసన్‌ తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా తన సత్తా చాటుతోంది. ఇక ఇప్పుడు శృతి దృష్టి ఇంటర్నేషనల్‌ మూవీస్‌పై పడిందట. అంటే చైనీస్‌ మూవీస్‌లాంటివి. భాషతో సంబంధం లేకుండా పలు ఇతర భాషా చిత్రాల్లో నటించాలన్నదే శృతి లక్ష్యమంటోంది. తనకు నటిగా మరింత గుర్తింపు ఎక్కడ లభిస్తుందో అంటూ వెతుకులాట కొనసాగిస్తూ ఉంటుందట ఎప్పుడూ. తెలుగు, తమిళ చిత్రాల్లో కన్నా హాలీవుడ్‌ మూవీస్‌లో హీరోయిన్‌కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి సినిమాల్లో నటించాలని శృతి అనుకుంటోందట. అరటే శృతి హాసన్‌ కూడా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి ఇన్‌ డైరెక్టుగా సై అంటోందేమో అనిపిస్తోంది. అలా అని ఆమెనడిగితే తెలుగులో ఇంకా అప్పుడే అలాంటి సినిమాల్లో నటించాలనుకోవడం లేదని కూడా చెబుతోంది. హీరోయిన్‌గా ప్రస్తుతం తెలుగులో శృతి చేస్తోన్న మూవీ 'కాటమరాయుడు' ఒక్కటే. తమిళంలో అయితే ఒకటి ఆరా ఉన్నప్పటికీ, ప్రస్తుతం శృతి మరీ అంత బిజీ ఏమీ కాదు. సో ప్రస్తుతం సీనియర్‌ హీరోయిన్లు హీరోయిన్‌ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి స్టోరీలపై ఎక్కువ ఇంట్రెస్ట్‌ కూడా చూపిస్తున్నారు. అలాగే శృతిహాసన్‌ కూడా త్వరలో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీతో మన ముందుకు వస్తుందేమో చూద్దాం!

Loading...