మోహన్‌బాబుకే అంత కష్టమొస్తే !

Posted on January 09, 2017

రాజ్యసభ సభ్యుడిగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహించిన ప్రముఖ తెలుగు సినీ నటుడు, నిర్మాత, అలాగే విద్యా సంస్థల అధిపతి కూడా అయినటువంటి మంచు మోహన్‌బాబుకే తిరుమల వెంకన్న దర్శనంలో సమస్యలు తలెత్తడం శోచనీయంగా ఉంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం మోహన్‌బాబు ప్రత్యేకత. అలాంటి ఆయన ఏ మాట మాట్లాడినా ఆచి తూచి వ్యవహరిస్తారు. టిటిడి అధికారుల నిర్వాకంపై మోహన్‌బాబు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే తిరుమల వెంకన్న దర్శనం సామాన్యులకు కనాకష్టమైపోతోంది వివిఐపీల వల్లన. వివిఐపిల సేవలో అధికార యంత్రాంగం తరిస్తోంటే సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఇక్కడ వివిఐపి అయిన మోహన్‌బాబుకి కూడా దర్శనం సమస్యాత్మకమవడమంటే దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణం స్పందించవలసి ఉంటుంది. డబ్బున్నవారికే సౌకర్యాలు అని మోహన్‌బాబు అనడం కూడా ఆశ్చర్యకరంగానే అనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రపంచంలోనే పేరెన్నికగన్న ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఇటువంటి వివాదాలకు దూరంగా ఉండాలి. తక్షణం ప్రభుత్వం జోక్యం కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందనే ఆశిద్దాం.

Loading...