కితకితల కామెడీ 'వైరస్‌' !

Posted on January 09, 2017

సినిమా రిలీజ్‌కి ముందే సోషల్‌ మీడియాలో బోలెడంత హడావిడి సృష్టించేశాడు కామెడీ హీరో సంపూర్ణేష్‌ బాబు. 'హృదయ కాలేయం' అనే తన తొలి సినిమా సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ఈ కామెడీ హీరో తాజా చిత్రం 'వైరస్‌'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యింది. మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సంపూని అలా తెరపై చూస్తేనే చాలు నవ్వు ఆపుకోలేం. అలాంటిది ఈ సినిమాలో ఆయన రకరకాల గెటప్పుల్లో దర్శనమిస్తాడట. ఆ గెటప్స్‌కే ప్రేక్షకులు విరగబడి నవ్వుకుంటారట. ఎస్‌. ఆర్‌ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్‌ అట. ఓ హత్యోదంతం వెనుక ఉన్న రహస్యాన్ని చేధించడంలో హీరో పాత్ర వహించే సంపూ పర్‌ఫామెన్స్‌ నుండి వచ్చే కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయం అంటోంది చిత్ర యూనిట్‌. చాలా సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌లో కనిపించి కూడా సంపూ నవ్వులు పూయించాడు. 'కరెంట్‌ తీగ' సినిమాలో ఏకంగా సన్నీ లియోన్‌కి భర్త పాత్రలో జస్ట్‌ అలా మెరుపుతీగలా మెరిశాడు. పాపులర్‌ సినిమాల్లోని సీన్స్‌ని స్ఫూప్స్‌ ద్వారా తన సినిమాల్లో తనదైన శైలిలో పండించి, కామెడీ కితకితలు పెట్టించాడు. తాజా సినిమాతో ఆ కితకితల డోస్‌ మరింత పెంచనున్నాడట. తాజాగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Loading...