మనం తాగే కూల్ డ్రింక్స్ లో పురుగుమందుల శాతం !

Posted on January 09, 2017

మనం ఎంతో ఇష్టంగా, ఇంకెంతో ప్రేమగా దాహమేస్తే వెంటనే కూల్ డ్రింక్ అంటాం. మంచి నీరు దొరకని ప్రదేశాలు ఉన్నాయేమో గాని మద్యం, కూల్ డ్రింక్స్ దొరకని ప్రదేశాలు లేవంటే అతిశయోక్తి కాదనుకుంటా. సిగెరెట్, మందు కంటే కూల్ డ్రింక్స్ ప్రమాదకరమని ఎన్నో సార్లు చెప్పిన, చెబుతున్న ఎవ్వరూ పట్టించుకోరు. తాజాగా మరో అధ్యయనం దీని ఫలితాలను వెల్లడించింది. బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కంటే 24 రేట్లు ఎక్కువగా పెస్టిసిడ్స్ ఉన్నాయని తెలిపింది. కొన్నిటిని భారత దేశంలో రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కంటే ప్రాణాంతక పెస్టిసిడ్స్ 71 శాతం ఎక్కువగా ఉండడమే. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తాజా నివేదిక ప్రకారం మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్న కూల్ డ్రింక్స్ లో పెస్టిసిడ్స్ ఎంత మేర ఉన్నదో తెలిపింది. కోకాకోల - పెప్సికో కంపెనీల ద్వారా తయారుకాబడిన 11 రకాల బ్రాండ్స్ ను పరిశీలించారు. ఈ అధ్యయనం ద్వారా వెల్లడైన విషయాలు చాలా ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉండడం భయాందోళనకు గురి చేస్తున్నాయి. బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కంటే వీటి శాతం 30 నుండి 70 శాతం అధికంగా ఉండడమే. source : The Hindu

Loading...