వావ్‌ మెగాస్టార్‌ హీ ఈజ్‌ ద 'మ్యాన్‌' !

Posted on January 08, 2017

సాధారణంగా తమ సినిమా ఫంక్షన్లలో తమ గురించే చెప్పుకుంటుంటారు. ఇతర సినిమాల ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడతారు. అయితే తన సినిమాతోపాటు సంక్రాంతికి పోటీ పడుతున్న బాలకృష్ణ సినిమా గురించి కూడా చిరంజీవి మాట్లాడారు. తనతోపాటుగా అల్లు అర్జున్‌తోనూ చిరంజీవి మాట్లాడించారు. సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ విషయాన్నే చిరంజీవి చెప్పారు. తన మిత్రుడు బాలకృష్ణ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో వస్తున్నాడనీ, ఆ సినిమా కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు చిరంజీవి. బాలకృష్ణతోనే సరిపెట్టలేదు, శర్వానంద్‌ 'శతమానంభవతి' సినిమాని అలాగే ఆర్‌.నారాయణమూర్తి సినిమా 'హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య'నీ ప్రస్తావిస్తూ అవన్నీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా వెల్లడించారు. 'ఖైదీ', 'శాతకర్ణి' సినిమాలు పోటీ పడుతుండడం పట్ల సోషల్‌ మీడియాలో కొంత గందరగోళం చెలరేగుతోంది. ఒకరికి పోటీగా ఇంకొకరు వస్తున్నారని, ఇది ఆధిపత్య పోరు అనీ ప్రచారం జరుగుతుంది. దీనివల్ల సినీ పరిశ్రమలోని ఆరోగ్యకరమైన వాతావరణానికి ఇబ్బంది కలిగేలా తయారైంది. దాంతో హుందాతనం ప్రదర్శించిన చిరంజీవి, బాలకృష్ణ సినిమాకి విషెస్‌ తెలిపారని అర్థం చేసుకోవాలి. బాలకృష్ణ కూడా రేపు 'శాతకర్ణి' పతాకోత్సవంలో పాల్గొననుండడంతో చిరంజీవి సినిమాకి ఆల్‌ ది బెస్ట్‌ తన హుందాతనం చాటుకుంటారేమో చూడాలిక.

Loading...