పెద్ద నోట్ల రద్దు భయంకరమైన ఫెయిల్యూర్‌?

Posted on January 07, 2017

పెద్ద నోట్ల రద్దుతో అవినీతి అంతమయిపోతుందని ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. అయితే అది జరిగే పని కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి పెద్ద నోట్ల రద్దుకు ప్రభుత్వం చెప్పిన కారణాలు ఏవీ సరైనవి కాదని రాజకీయ పరిశీలకులే కాకుండా, ఆర్థిక రంగ నిపుణులు కూడా ఇప్పుడు అభిప్రాయపడుతుండడం భయాందోళనల్ని రేకెత్తిస్తుంది. అయితే ఇది చాలా కాస్ట్‌లీ మిస్టేక్‌ అనీ, భయంకరమైన ఫెయిల్యూర్‌ అనీ వారు చెబుతోంటే, ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోవడం జరుగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందనే భావన అన్ని వర్గాల నుంచీ వ్యక్తమవుతోంది. ఇటువంటి కీలక నిర్ణయాలు ముందస్తు ఎక్సర్‌సైజ్‌ తర్వాతే అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే అక్రమార్కులు జాగ్రత్తపడిపోతారని ప్రధాని నరేంద్రమోడీ భావించి ఉండవచ్చు. కానీ అడ్డదారులు తొక్కేవారికి కొత్తదారులు ఎప్పుడూ ఉంటాయి. అలా వారు ఆయా దారుల్లో పెద్ద నోట్ల రద్దు సంక్షోభం నుంచి బయటపడ్డారు. సామాన్యులే ఇక్కడ సమిధలుగా మారిపోయారు. ప్రధానంగా ఉత్పాదక రంగం చాలా దెబ్బతినడంతో దేశంలో ఉపాధి కోల్పోయారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి రంగాలు దెబ్బతింటే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే నరేంద్రమోడీ సర్కార్‌ మాత్రం, భయపడేంత ఆందోళనకరమైన పరిస్థితులు లేవని అంటోంది. అయినప్పటికీ కూడా పెద్ద నోట్ల రద్దు వల్ల తాము ఆశించిన ప్రయోజనాలేవీ ఇప్పుడు కనిపించకపోవడంతో ప్రజలు కూడా కేంద్రం చెప్పే మాటల్ని విశ్వసించలేకపోతున్నారు.

Loading...