5 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా !

Posted on January 04, 2017

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. తక్షణం ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మిజోరాం, గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతలుగా ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమిది. అలాగే, దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారబోతున్నాయి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ ఎంతో పట్టుదలగా ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలకన్నా ఉత్తర ప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలదే హవా. అధికార సమాజ్‌వాదీ పార్టీ అలాగే, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నువ్వా? నేనా? అన్నట్లుగా తలపడనున్నాయి. ఇంకో వైపున పంజాబ్‌లో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య రసవత్తర రాజకీయం నడవనుంది. ఉత్తరాఖండ్‌లో కూడా ఇంతే. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. దాంతో ఈ ఎన్నికల ఫలితం తమకు అనుకూలంగా వస్తే అది పెద్ద నోట్ల రద్దుకి ప్రజామోదంగా బిజెపి భావించనుంది. ఓడితే, అసెంబ్లీ ఎన్నికలే గనుక అవి తమకు సంబంధం లేనివిగా బిజెపి బుకాయించవచ్చును కూడా. 690 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 4న ప్రారంభమయ్యే ఎన్నికల పోలింగ్‌ మార్చ్‌ 8వ ముగుస్తుంది. ఆయా రాష్ట్రాల్లో నిర్దేశించిన తేదీల్లో ఎన్నికల్ని నిర్వహించనున్నారు.

Loading...