నాన్న, నేను మాత్రమే - బాబాయ్‌ ఔట్‌!

Posted on January 04, 2017

బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ని పార్టీ నుంచి బయటకు పంపడానికి అబ్బాయ్‌ అఖిలేష్‌ యాదవ్‌ వేసిన స్కెచ్‌ వర్కవుట్‌ అయినట్లుగానే ఉంది. నీదీ కాదూ, నాదీ కాదూ సైకిల్‌ ఎటూ కాకుండా పోతుందని తండ్రి చేసిన హెచ్చరికలతో కొడుకు అఖిలేష్‌ యాదవ్‌, తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ని వెతుక్కుంటూ వెళ్ళారు. మూడు గంటలపాటు వీరిద్దరి నడుమ సమావేశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాన్ని నీకిచ్చేస్తాను, పార్టీ పగ్గాలు నా చేతుల్లోనే ఉండాలనే ప్రతిపాదన ములాయం చేయడంతో, అఖిలేష్‌ ఓ షరతు పెట్టి ఒప్పుకున్నారు. అదేమిటంటే బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌, ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదని. సరే, నీ ఇష్టం అని ములాయం చెప్పడంతో సమాజ్‌వాదీ పార్టీలో కొంతవరకు దుమారం తగ్గినట్లుగానే భావించాలి. లేదంటే త్వరలో ఎన్నికలు జరగనుండగా పార్టీలో విభజన కారణంగా పార్టీ గుర్తుగానీ, జెండాగానీ ఏ వర్గానికీ చెందకుండా పోయేది. ఎన్నికల సంఘం నుంచి కూడా దీనిపై ఊహాగానాలు వచ్చేసరికి తండ్రి, కొడుకు సర్దుకుపోయారు. ఈ గేమ్‌లో అందరూ ఊహించినట్లుగానే అఖిలేష్‌ యాదవ్‌ ఒంటరి అయిపోయారు. ఆయన కారణంగానే పార్టీలో చీలిక వచ్చింది. ఆయన పార్టీకి దూరం కాకపోయినా అఖిలేష్‌కి అడ్డం తగలకపోతే సమస్య ఏముంటుంది?

Loading...